TTD: తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. టికెట్‌తోపాటే దర్శనం

TSRTC Good News To Tirumala Devotees
  • టీటీడీతో ఒప్పందం చేసుకున్న టీఎస్ఆర్టీసీ
  • నేటి నుంచే అమల్లోకి వస్తుందన్న సజ్జనార్
  • రోజూ వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంటాయన్న ఆర్టీసీ ఎండీ
తిరుమల వెంకన్న దర్శనానికి తెలంగాణ నుంచి వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తిరుపతి వెళ్లే బస్ టికెట్‌తో పాటే దర్శన టికెట్‌ను కూడా బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందం కుదుర్చుకుంది. నేటి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. 

ప్రతి రోజూ వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. తిరుమలకు బస్ టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ వెబ్‌సైట్ ద్వారా కానీ, లేదంటే అధీకృత డీలర్ వద్ద నుంచి కానీ టికెట్లు బుక్ చేసుకోవచ్చన్న సజ్జనార్ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
TTD
Tirumala
Tirupati
TSRTC
VC Sajjanar

More Telugu News