Naresh: నటి పవిత్ర లోకేశ్ కు నాకు మధ్య స్నేహం తప్ప మరేమీ లేదు: సీనియర్ నటుడు నరేశ్

Naresh explains friendship with actress Pavitra Lokesh
  • పవిత్ర లోకేశ్ కు, నరేశ్ కు మధ్య ప్రేమ అంటూ కథనాలు
  • వివరణ ఇచ్చిన నరేశ్
  • తన భార్య రమ్య బెదిరిస్తోందని ఆరోపణ
  • ఆమె మానసిక స్థితి సరిగా లేదని వెల్లడి
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, దక్షిణాది నటి పవిత్ర లోకేశ్ కు మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ ఇటీవల పలు కథనాలు వచ్చాయి. దీనిపై నరేశ్ వివరణ ఇచ్చారు. పవిత్ర లోకేశ్ కు తనకు మధ్య ఉన్నది కేవలం స్నేహం అని స్పష్టం చేశారు. హ్యాపీ వెడ్డింగ్ సినిమా షూటింగ్ లో ఆమె తనకు పరిచయం అయిందని, ఐదేళ్లుగా తమకు పరిచయం ఉందని తెలిపారు. తాను కూడా మనిషేనని, మగాడ్ని అని, తనకు భావోద్వేగపరమైన మద్దతు అవసరం అని నరేశ్ పేర్కొన్నారు. 

సమ్మోహనం చిత్రం సమయంలో ఇద్దరి మధ్య స్నేహం బలపడిందని, ఇరువురి ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయని తెలుసుకున్నామని వివరించారు. కానీ రమ్య (నరేశ్ మూడో భార్య) వచ్చి ఇప్పుడు రచ్చ చేస్తోందని ఆరోపించారు. పవ్రిత లోకేశ్ ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తనను సాధించాలని ప్రయత్నిస్తోందని నరేశ్ మండిపడ్డారు. రమ్యకు మానసిక స్థితి సరిగా లేదని డాక్టర్ ఎప్పుడో చెప్పారని వివరించారు. తనను వేధిస్తూ, బ్లాక్ మెయిల్ కు గురిచేసి డబ్బులు గుంజాలన్నదే ఆమె ప్రయత్నమని తెలిపారు. పవిత్ర లోకేశ్ ఇప్పుడు తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అని, అన్ని ఫంక్షన్లకు వస్తుందని అన్నారు. కానీ మా ఫ్యామిలీ ఫంక్షన్లకు నువ్వేనాడైనా వచ్చావా? అంటూ రమ్యను ప్రశ్నించారు.
Naresh
Pavitra Lokesh
Friendship
Relationship
Tollywood

More Telugu News