YSRCP: రెవెన్యూ డివిజ‌న్లుగా పులివెందుల... తుది నోటిఫికేష‌న్ విడుద‌ల‌

  • పులివెందుల‌తో పాటు కొత్త‌పేట కూడా రెవెన్యూ డివిజ‌నే
  • ఇదివ‌ర‌కే డ్రాఫ్ట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం
  • ఇక అధికారికంగా రెండు ప‌ట్ట‌ణాల‌కు రెవెన్యూ డివిజ‌న్ల హోదా
pulivendula and kottapeta upgraded to revenue divisions

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్  మోహ‌న్ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల కూడా రెవెన్యూ డివిజ‌న్‌గా మారిపోయింది. ఈ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వం గురువారం తుది నోటిఫికేష‌న్ జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు సంద‌ర్భంగా ఆయా జిల్లాల సంఖ్య‌కు అనుగుణంగా ప‌లు ప‌ట్ట‌ణాల‌ను రెవెన్యూ డివిజ‌న్లుగా అప్‌గ్రేడ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క్రియ అంతా ఎప్పుడో పూర్తి అయిపోయింది.

ఆ త‌ర్వాత పులివెందుల‌తో పాటు కోన‌సీమ జిల్లాలోని కొత్త‌పేట‌ను కూడా రెవెన్యూ డివిజ‌న్ గా ప్ర‌క‌టించాల‌న్న డిమాండ్లు వ‌చ్చాయి. వీటిని ప‌రిశీలించిన ప్ర‌భుత్వం ఆ రెండు ప‌ట్ట‌ణాల‌ను కూడా రెవెన్యూ డివిజ‌న్లుగా ఏర్పాటు చేసే ప్రక్రియ‌ను మొద‌లుపెట్టింది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే డ్రాఫ్ట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం... దాని గ‌డువు ముగిసిపోవడంతో తుది నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది.

More Telugu News