Chandrasekhar: రామ్ చరణ్ ను కలిసేందుకు బళ్లారి నుంచి హైదరాబాదుకు అభిమాని కాలినడక

Die hard fan Chandrasekhar arrives Hyderabad from Bellari by walk
  • రామ్ చరణ్ కు వీరాభిమాని... చంద్రశేఖర్
  • బళ్లారి నుంచి 8 రోజుల ప్రయాణం
  • కాలినడకన వందల కిలోమీటర్ల పయనం
  • హైదరాబాదులో స్వాగతం పలికిన స్వామినాయుడు
సినీ తారల అభిమానుల్లో వీరాభిమానులు వేరు. తమ ఆరాధ్య తారల కోసం వారు ఏంచేయడానికైనా సిద్ధంగా ఉంటారు. కొన్ని సందర్భంగా వందల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి తమ ఫేవరెట్ స్టార్లను కలిసేందుకు వస్తుంటారు. బళ్లారికి చెందిన బి.చంద్రశేఖర్ కూడా ఆ కోవలోకే వస్తాడు. 

చంద్రశేఖర్ టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ కు వీరాభిమాని. ఈ మెగా ఫ్యాన్ తన ఆరాధ్య హీరో రామ్ చరణ్ ను కలవాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం పాదయాత్ర ఎంచుకున్నాడు. బళ్లారి నుంచి బయలుదేరి 8 రోజులు కాలినడకన పయనించి హైదరాబాదు చేరుకున్నాడు. చంద్రశేఖర్ కు ఈ సందర్భంగా మెగా స్వాగతం లభించింది. 

ఆలిండియా చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు బళ్లారి యువకుడు చంద్రశేఖర్ కు సాదర స్వాగతం పలికారు. అతడికి శాలువా కప్పి సన్మానించారు. ఈ వివరాలను స్వామినాయుడే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. చంద్రశేఖర్ త్వరలోనే రామ్ చరణ్ ను కలవనున్నాడని తెలిపారు.
.
Chandrasekhar
Ramcharan
Hyderabad
Bellari
Walk

More Telugu News