ట్విట్టర్ కు తుది నోటీసులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

Twitter Gets Final Notice From Centre
  • తమ ఆదేశాలను పాటించేందుకు జులై 4ను డెడ్ లైన్ గా విధించిన కేంద్రం
  • పాటించకపోతే అన్ని కామెంట్లకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిక
  • కొన్ని ట్విట్టర్ అకౌంట్లను, ట్వీట్లను తొలగించాలన్న కేంద్రం
గతంలో తామిచ్చిన ఆదేశాలన్నింటినీ జులై 4లోగా పాటించాలని ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వం తుది నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఫైనల్ నోటీస్ పంపించింది. గడువులోగా నిబంధనలను పాటించకపోతే... ట్విట్టర్ లో పోస్ట్ అయిన అన్ని కామెంట్లకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. 

అంతర్జాతీయ న్యాయవాద గ్రూప్ ఫ్రీడమ్ హౌస్, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, రైతుల నిరసనకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లను, కొన్ని ట్వీట్లను తొలగించాలని ట్విట్టర్ ను కేంద్ర ప్రభుత్వం గతంలో కోరింది. ఈ క్రమంలో జూన్ 26న తాము బ్లాక్ చేసిన 80కి పైగా ట్విట్టర్ అకౌంట్లు, ట్వీట్ల జాబితాను కేంద్రానికి ట్విట్టర్ అందించింది. అయినప్పటికీ తాము చేసిన ఆదేశాల్లో ఇంకా పాటించాల్సినవి చాలా ఉన్నాయని... వాటన్నింటినీ జులై 4లోగా పాటించాలంటూ కేంద్రం చివరి నోటీసును జారీ చేసింది.
Go Back to Shorts
Twitter
Centre
Notice

More Telugu News