ఇడుపులపాయలో గ్రామ సచివాలయానికి తాళం!... కారణమేంటంటే..!
- ఆర్బీకే ఏర్పాటుపై వైసీపీలోని రెండు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు
- ఇడుపులపాయలోనే ఆర్బీఏ ఏర్పాటు చేయాలన్న ఓ వర్గం
- వర్షానికి మునిగే ప్రాంతంలో ఆర్బీకే వద్దన్న మరో వర్గం
ఈ ఘటనకు దారి తీసిన వివరాల్లోకెళితే... ఇడుపులపాయలో రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) ఏర్పాటుకు సంబంధించి గ్రామ వైసీపీ శాఖలోని రెండు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇడుపులపాయలో గ్రామ సచివాలయం సమీపంలోనే ఆర్బీకేను ఏర్పాటు చేయాలని ఓ వర్గం వాదించింది. అయితే వర్షం పడితే ఆ ప్రాంతం నీట మునుగుతుందని, అలాంటి ప్రాంతంలో ఆర్బీకే ఏర్పాటు వద్దని ఇంకో వర్గం వాదించింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి వివాదం చెలరేగింది. అనంతరం వైంపల్లె జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి వద్ద ఇరు వర్గాలు పంచాయితీ పెట్టాయి.