లారెన్స్ 'చంద్రముఖి'గా భయపెట్టనున్న త్రిష!

29-06-2022 Wed 11:18
  • తెలుగు .. తమిళ భాషల్లో త్రిషకి మంచి క్రేజ్
  • నాయిక ప్రధానమైన కథలను చేస్తున్న త్రిష 
  • 'చంద్రముఖి 2' కి ఓకే చెప్పిందంటూ టాక్
  • 'చంద్రముఖి'తో మెప్పించిన పి.వాసునే ఈ సినిమాకి దర్శకుడు  
Chandarmukhi 2 movie update
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా త్రిష ఒక సమయంలో ఊపేసింది. స్టార్ హీరోలతో సినిమాలు .. భారీ విజయాలు ఆమె చుట్టూనే తిరిగాయి. చాలా కాలం పాటు తన జోరును కొనసాగించిన త్రిషకి తెలుగు నుంచి అవకాశాలు వెళ్లక చాలా రోజులైంది. దాంతో ఆమె తమిళ సినిమాలపైనే దృష్టి పెట్టింది. 

తమిళంలో త్రిష నాయిక ప్రధానమైన సినిమాలను ఎక్కువగా చేస్తూ వెళుతోంది. ఆ జాబితాలో సస్పెన్స్ థ్రిల్లర్లు .. హారర్ థ్రిల్లర్లు కూడా ఉన్నాయి. తాజాగా ఆమె మరో హారర్ కామెడీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్ .. ఆ సినిమానే  'చంద్రముఖి 2'. గతంలో వచ్చిన రజనీకాంత్ 'చంద్రముఖి'కి ఇది సీక్వెల్.

 'చంద్రముఖి 2'ను రజనీతో చేయాలని పి. వాసు ప్రయత్నించాడుగానీ కుదరలేదు. దాంతో ఆయన లారెన్స్ ను రంగంలోకి దింపాడు. 'చంద్రముఖి' పాత్ర కోసం త్రిషను తీసుకున్నారని అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించే ఈ సినిమాలో, రాశి ఖన్నా .. ఆండ్రియా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది.