టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నటి మీనా భర్త మృతి

29-06-2022 Wed 06:34
  • జనవరిలో కరోనా బారినపడిన మీనా కుటుంబం
  • గత కొన్నాళ్లుగా ఆసుపత్రిలో చికిత్స 
  • పరిస్థితి విషమించడంతో గత రాత్రి కన్నుమూత
  • నేడు చెన్నైలో అంత్యక్రియలు
Tollywood actress meena husband passed away
టాలీవుడ్ ప్రముఖ నటి మీనా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యం బారినపడి గత కొన్ని నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భర్త విద్యాసాగర్ (48) గత రాత్రి చెన్నైలో మృతి చెందారు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన విద్యాసాగర్‌ను 2009లో మీనా వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. 

జనవరిలో మీనా కుటుంబం కరోనా బారినపడింది. ఆ తర్వాత వారు కోలుకున్నప్పటికీ విద్యాసాగర్ మాత్రం కోలుకోలేకపోయారు. అది మరింత తీవ్రం కావడంతో చెన్నైలోని ఆసుపత్రిలో చేర్చారు. అంతలోనే ఆయన ఆరోగ్యం విషమించడంతో గత రాత్రి కన్నుమూశారు. విద్యాసాగర్ మరణవార్త తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. విషయం తెలిసిన సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసాగర్ అంత్యక్రియలు నేడు చెన్నైలో జరగనున్నాయి.