Hyderabad: అవసరమైతే తప్పించి బయటకు రావొద్దు.. హైదరాబాదీలకు జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌

ghmc alerts people in view orf heavy rains in hyderabad
  • న‌గ‌రంలో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నుంచే వ‌ర్షం
  • సికింద్రాబాద్‌, అల్వాల్‌, నేరెడ్‌మెట్ ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం
  • రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ బృందాలు
హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల‌కు గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ) మంగ‌ళ‌వారం సాయంత్రం ఓ కీల‌క హెచ్చ‌రిక జారీ చేసింది. అవ‌స‌ర‌మైతే త‌ప్పించి ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు సూచించింది. న‌గ‌రంలో మంగ‌ళ‌వారం రాత్రి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున న‌గ‌ర ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరింది. 

న‌గ‌రంలోని సికింద్రాబాద్‌, అల్వాల్‌, నేరెడ్ మెట్ త‌దిత‌ర ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో కురుస్తున్న వ‌ర్షం నేప‌థ్యంలో ఆయా ప్రాంతాలు ఇప్ప‌టికే జ‌ల‌మ‌య్యాయ‌ని తెలిపారు. జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
Hyderabad
GHMC
DRF
Rain

More Telugu News