Perni Nani: కొడాలి నానిని ఓడించడం తర్వాత సంగతి... ముందు పోటీ చేయడానికి అభ్యర్థి ఉన్నాడేమో చూస్కోండి: పేర్ని నాని

Perni Nani comes in support for fellow YCP leader Kodali Nani
  • గుడివాడలో టీడీపీ మహానాడు
  • టీడీపీ నేతలు, కొడాలి నాని మధ్య మాటల యుద్ధం
  • కొడాలి నానికి చెమటలు పడుతున్నాయన్న బుద్ధా
  • దమ్ముంటే చంద్రబాబు తనపై పోటీ చేయాలన్న కొడాలి
  • బాబే కాదు ఎవరొచ్చినా కొడాలిని ఏంచేయలేరన్న పేర్ని
గుడివాడలో తెలుగుదేశం మహానాడు నేపథ్యంలో టీడీపీ నేతలకు, వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి మధ్య మాటల యుద్ధం రాజుకుంది. గుడివాడలో టీడీపీ బహిరంగ సభ అనగానే కొడాలి నానికి చెమటలు పడుతున్నాయని, చంద్రబాబు అంటే భయపడుతున్నారని బుద్ధా వెంకన్న విమర్శించారు. 

దీనిపై కొడాలి నాని కూడా దీటుగానే స్పందించారు. చంద్రబాబు నన్ను ఓడించడం కాదు, వచ్చే ఎన్నికల్లో కుప్పంలో గెలుస్తాడో లేదో చూసుకోవాలి అని అన్నారు. అంతేకాదు, దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. జగన్ ప్రభంజనంలో చంద్రబాబు కొట్టుకుపోతాడని హెచ్చరించారు. 

ఈ నేపథ్యంలో, కొడాలి నానికి మరో మాజీ మంత్రి పేర్ని నాని మద్దతుగా రంగంలోకి దిగారు. గుడివాడకు కొడాలి నాని ఓ బ్రాండ్ అంబాసిడర్ అని అభివర్ణించారు. గుడివాడలో కొడాలి నానిని ఓడించడం తర్వాత సంగతి... ముందు పోటీకి ఎవరైనా అభ్యర్థి ఉన్నాడేమో చూసుకోండి అంటూ ఎద్దేవా చేశారు. బాబు మాత్రమే కాదు... ఎంతమంది దిగొచ్చినా కొడాలి నానిని ఏమీ చేయలేరని పేర్ని నాని స్పష్టం చేశారు.
Perni Nani
Kodali Nani
Gudivada
Chandrababu
YSRCP
TDP

More Telugu News