పుతిన్ మరో రెండేళ్లకు మించి బతికే అవకాశాలు లేవు: ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారి
- పుతిన్ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందన్న ఉక్రెయిన్ నిఘా అధికారి
- రష్యాలో తాను రహస్యంగా పర్యటించినప్పుడు ఈ విషయం తెలిసిందని వెల్లడి
- తనకు కచ్చితమైన సమాచారం అందిందని వ్యాఖ్య
ఈ క్రమంలో ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారి మేజర్ జనరల్ కైరిలో బుడానోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ఆరోగ్యం చాలా వేగంగా క్షీణిస్తోందని చెప్పారు. రెండేళ్లకు మించి ఆయన జీవించే అవకాశాలు ఏమాత్రం లేవని అన్నారు. ఇటీవలే తాను రష్యాలో రహస్యంగా పర్యటించానని... తనకు ఈ మేరకు కచ్చితమైన సమాచారం అందిందని చెప్పారు.
మరోవైపు పుతిన్ కంటిచూపు కూడా తగ్గినట్టు వార్తలు వస్తున్నాయి. పుతిన్ ఇప్పటికే క్యాన్సర్ బాధితుడని, ఆయనకు గతంలో క్యాన్సర్ సర్జరీ కూడా జరిగిందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు క్యాన్సర్ మరింత ముదిరిందని అంటున్నారు. ఇంకోవైపు బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుతిన్ కు వైద్యులు సూచించినట్టు సమాచారం.