ఏపీ సీఎం జగన్ పారిస్ టూర్ ఖరారు... రేపు సాయంత్రం ఫ్లైటెక్కనున్న జగన్
- కూతురు చదివే కళాశాల స్నాతకోత్సవానికి హాజరు కానున్న జగన్
- జగన్ పారిస్ టూర్‌కు అనుమతిచ్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు
- జులై 3న తిరిగి రానున్న జగన్
తన కుమార్తె విద్యనభ్యసిస్తున్న కళాశాల స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు జగన్ పారిస్ వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన కోసం రేపు (మంగళవారం) రాత్రి 7.30 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరనున్న జగన్ పారిస్‌లో వచ్చే నెల 2వ తేదీ వరకు పర్యటించనున్నారు. ఆ తర్వాత జులై 3న ఆయన తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.