య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్ దాఖ‌లు... టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ హాజ‌రు

27-06-2022 Mon 14:07
  • విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా
  • పార్ల‌మెంటు భ‌వ‌న్‌లో నామినేష‌న్ దాఖ‌లు
  • రాహుల్ గాంధీ, శ‌ర‌ద్ ప‌వార్‌, అఖిలేశ్ త‌దిత‌రుల హాజ‌రు
Yashwant Sinha files his nomination for the election of president on india
భార‌త రాష్ట్రప‌తి ఎన్నికల్లో సోమ‌వారం మ‌రో కీల‌క ఘ‌ట్టం చోటుచేసుకుంది. విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా త‌న నామినేష‌న్ దాఖ‌లు చేశారు. పార్ల‌మెంటు భ‌వ‌న్‌లో విప‌క్షాలకు చెందిన ప‌లువురు నేత‌లు వెంట రాగా.. సిన్హా రిట‌ర్నింగ్ అధికారికి త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు.

ఈ కార్య‌క్రమానికి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ, రాజ్య‌స‌భ‌లో విప‌క్ష నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌, స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ త‌దిత‌రులు హాజ‌రయ్యారు. ఇక సిన్హాకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన తెలంగాణ రాష్ట్ర స‌మితి త‌ర‌ఫున ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ హాజ‌ర‌య్యారు.