మా ప్రాణాలకు ముప్పు ఉంది: సుప్రీంకోర్టులో శివసేన రెబెల్స్ పిటిషన్
- సుప్రీంకోర్టులో రెబెల్స్ నాయకుడు ఏక్ నాథ్ షిండే పిటిషన్
- బతికున్న శవాలు అంటూ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను పిటిషన్ లో పేర్కొన్న వైనం
- సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని కోర్టుకు వెల్లడి
మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేనకు చెందిన 55 మంది ఎమ్మెల్యేలలో 38 మంది మద్దతును ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని చెప్పారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించేలా డిప్యూటీ స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో కోరారు. రెబెల్ ఎమ్మెల్యేలంతా అసోంలోని గువాహటిలో క్యాంపు పెట్టిన సంగతి తెలిసిందే.