టీమిండియా కెప్టెన్ గా అరుదైన రికార్డు సాధించిన పాండ్యా!

  • టీ20ల్లో వికెట్ పడగొట్టిన తొలి టీమిండియా కెప్టెన్ గా పాండ్యా
  • మ్యాచ్ రెండో ఓవర్ లో వికెట్ తీసిన పాండ్యా
  • బ్యాటింగ్ లో కూడా రాణించిన పాండ్యా
Hardhik Pandya new record in T20

నిన్న రాత్రి జరిగిన తొలి టీ20లో ఐర్లండ్ ను టీమిండియా చిత్తు చేసింది. ఐర్లండ్ ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. మరోవైపు, ఈ మ్యాచ్ లో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా అరుదైన రికార్డును సాధించాడు. టీ20ల్లో వికెట్ తీసిన తొలి టీమిండియా కెప్టెన్ గా ఘనతను సొంతం చేసుకున్నాడు. 

ఈ మ్యాచ్ లో రెండో ఓవర్ బౌలింగ్ వేసిన పాండ్యా... ఐర్లండ్ ఓపెనర్ స్టిర్లింగ్ (4)ను ఔట్ చేసి ఈ ఘనత సాధించాడు. ఇంత వరకు టీ20ల్లో జట్టుకు నాయకత్వం వహించిన మరెవరూ వికెట్ సాధించలేకపోయారు. మరోవైపు పొట్టి ఫార్మాట్ లో టీమిండిగా కెప్టెన్ గా బాధ్యతలను స్వీకరించిన ఎనిమిదో ఆటగాడు పాండ్యా కావడం గమనార్హం.

More Telugu News