తన వ్యక్తిగత సహాయకుడి పెళ్లి జరిపించిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

25-06-2022 Sat 20:23
  • చంద్రబాబు వద్ద పనిచేస్తున్న మేకల శ్రీనివాసరావు
  • శ్రీనివాసరావు స్వస్థలం పల్నాడు
  • నాలుగేళ్ల కిందట బాబు వద్ద ఉద్యోగంలో చేరిన వైనం
  • గురువారం నాడు చంద్రికతో వివాహం
Chandrababu attends personal assistant marriage in Vijayawada
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన వ్యక్తిగత సహాయకుడు మేకల శ్రీనివాసరావు పెళ్లి జరిపించారు. మేకల శ్రీనివాసరావు నాలుగేళ్ల క్రితం చంద్రబాబు బృందంలో చేరాడు. అతడు పల్నాడు ప్రాంతానికి చెందిన యువకుడు. శ్రీనివాసరావు వివాహం మాచర్లకు చెందిన చంద్రికతో జరిగింది. ఈ వివాహానికి చంద్రబాబు అన్నీ తానై వ్యవహరించడం విశేషం. 

శ్రీనివాసరావు ఇటీవల చంద్రబాబుకు పెళ్లిపత్రిక అందించగా, పెళ్లికి తప్పకుండా వస్తానని ఆయన మాటిచ్చారు. అంతేకాదు, విజయవాడలో ఈ పెళ్లికి వేదిక, పెళ్లి వేడుక ఏర్పాట్లు, విందు... ఇత్యాది ఏర్పాట్లన్నీ చంద్రబాబు స్వయంగా పురమాయించారు. గురువారం (జూన్ 23) నాడు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఓ హోటల్ లో మేకల శ్రీనివాసరావు, చంద్రికల వివాహం జరగ్గా, చంద్రబాబు హాజరై వధూవరులకు ఆశీస్సులు అందజేశారు.