Janasena: జనసేన కౌలు రైతు భరోసాకు విరాళం ఇచ్చిన‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ల్లి అంజ‌నా దేవి

  • జ‌న‌సేన కౌలు రైతు భ‌రోసాకు రూ.1.50 ల‌క్ష‌లిచ్చిన అంజ‌నా దేవి
  • జ‌న‌సేన‌కు రూ.1ల‌క్ష విరాళ‌మిచ్చిన ప‌వ‌న్ త‌ల్లి
  • ప‌వ‌న్‌కు చెక్కులు అంద‌జేసిన వైనం
pawan kalyan mother anjana devi gives one and half lacks janasena koulu raitu bharosa

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన చేప‌ట్టిన కౌలు రైతు భ‌రోసాకు ప‌వ‌న్ కుటుంబ స‌భ్యుల నుంచి ఇప్ప‌టికే విరాళాలు అందిన సంగ‌తి తెలిసిందే. తాజాగా పార్టీ కౌలు రైతు భ‌రోసాకు ప‌వ‌న్ త‌ల్లి అంజ‌నా దేవి త‌న వంతుగా సాయం అంద‌జేశారు. రూ.1.50 ల‌క్ష‌ల‌ను కౌలు రైతు భ‌రోసాకు ఇచ్చిన అంజ‌నా దేవి, మ‌రో రూ.1 ల‌క్ష‌ను పార్టీకి విరాళంగా ఇచ్చారు. ఈ మేర‌కు హైద‌రాబాద్‌లో ప‌వ‌న్‌కు ఆమె చెక్కులు అంద‌జేశారు. త‌న భ‌ర్త కొణిదెల వెంక‌ట్రావు జ‌యంతి సంద‌ర్భంగా ఆమె ఈ విరాళాన్ని అందిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. 

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ త‌న తండ్రి ఏపీ ప్ర‌భుత్వంలో ఉద్యోగ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించి రిటైర్ అయ్యార‌ని చెప్పారు. ఎక్సైజ్ శాఖ‌లో ఆయ‌న ప‌నిచేశార‌ని, ఆయ‌న‌కు వ‌చ్చిన జీతంతోనే తామంతా పెరిగామ‌ని, 2007లో త‌న తండ్రి మ‌ర‌ణించార‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో త‌న త‌ల్లికి ప్ర‌భుత్వం పెన్ష‌న్ అందిస్తోంద‌ని, ఆ సొమ్మును ఆత్మహ‌త్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌ను ఆదుకునేందుకు త‌న త‌ల్లి ఇవ్వ‌డం త‌న‌కు సంతోషంగా ఉంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

More Telugu News