చిత్తూరు మాజీ మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారు: డీజీపీకి చంద్రబాబు లేఖ
- 2015లో కఠారి అనురాధ, కఠారి మోహన్ హత్య
- విచారణలో జాప్యం చేస్తున్నారన్న చంద్రబాబు
- కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడి
- పోలీసులపై చంద్రబాబు ఆరోపణలు
అటు, మాజీ మేయర్ కఠారి హేమలత విషయంలోనూ పోలీసుల వైఖరి దారుణంగా ఉందని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసు చర్యలను నిరసించిందన్న కారణంగా హేమలతపై పోలీసు జీపు ఎక్కించారని, ఇప్పుడు ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉందని పేర్కొన్నారు. అయితే, హేమలత గాయపడడానికి కారకులైన వారిని ఆసుపత్రిలో చేర్చి, తిరిగి హేమలతపైనే కేసు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు.