నటించకుండానే రణబీర్ కపూర్ కు మొదటి సారి రూ.250 చెక్!

25-06-2022 Sat 13:16
  • 1996లో ప్రేమ్ గ్రంథ్ సినిమాకు సేవలు
  • ప్రతిగా రూ.250 పారితోషికం
  • తల్లి పాదాలకు సమర్పించినట్టు వెల్లడించిన రణబీర్
  • ఆ సినిమాలో రణబీర్ తండ్రి రిషికపూర్ హీరో
Ranbir Kapoor kept his first paycheck of 250 at Neetu Kapoors feet says she cried
బాలీవుడ్ ప్రముఖ యువ నటుడు రణబీర్ కపూర్ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకుని.. నట వారసత్వాన్ని నిలబెట్టిన వారిలో ఒకరు. తాను తొలిసారిగా రూ.250 చెక్కు అందుకున్న విషయాన్ని ఇన్ స్టా గ్రామ్ హ్యాండిల్ పై వెల్లడించారు. 

రణబీర్ కపూర్ దివంగత నటుడు రిషి కపూర్ కుమారుడు అన్న విషయం తెలిసిందే. 1996లో ప్రేమ్ గ్రంథ్ అనే సినిమా చిత్రీకరణ సందర్భంగా తన అంకుల్ రాజీవ్ కపూర్ కు రణబీర్ కపూర్ సేవలు అందించాడు. నాటి సినిమాలో రణబీర్ కపూర్ తండ్రి రిషికపూర్, మాధురీ దీక్షిత్ నటించారు. 

తొలిసారి ప్రేమ్ గ్రంథ్ సినిమా కోసం పనిచేసినందుకు రణబీర్ కపూర్ కు రూ.250 చెక్కు అందింది. దాన్ని ఆయన నేరుగా తీసుకెళ్లి.. తన తల్లి నీతు కపూర్ పాదాలపై ఉంచినట్టు చెప్పారు. అది చూసిన నీతూ కపూర్ ఏడవడం మొదలు పెట్టినట్టు రణబీర్ కపూర్ వెల్లడించాడు. ఇటీవలే ‘బాలీవుడ్ హంగామా’ అనే మీడియా సంస్థకు రణబీర్ కపూర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సమయంలో నీతూ కపూర్ కూడా ఆయన వెంట ఉన్నారు. రణబీర్ చెబుతున్నది విని ఆమె నవ్వారు.