'స్వాతిముత్యం' నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్!

  • విభిన్నమైన ప్రేమకథగా 'స్వాతిముత్యం'
  • కథానాయకుడిగా బెల్లంకొండ గణేశ్ పరిచయం 
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
  • ఆగస్టు 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు 
Swathi Muthyam  song promo released

బెల్లంకొండ గణేశ్ హీరోగా 'స్వాతిముత్యం' సినిమా రూపొందింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాతో, లక్ష్మణ్ కె కృష్ణ  దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా వర్ష బొల్లమ్మ కనిపించనుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను వదిలారు. 'నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా .. నీ మత్తులో మళ్లీ పడి లేస్తూ ఉన్నా' అంటూ ఈ పాట సాగుతోంది. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అర్మాన్ మాలిక్ - సంజన ఆలపించారు. హీరో హీరోయిన్లపై ఈ పాటను చిత్రీకరించారు .. బీట్ బాగుంది. 

పూర్తి సాంగ్ ను ఈ నెల 27వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. టైటిల్ ను బట్టే ఇది లవ్ ను టచ్ చేస్తూ సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. చిన్న సినిమాగా కనిపిస్తున్నప్పటికీ, సితార వంటి పెద్ద బ్యానర్లో ఈ సినిమా వస్తోంది. ఈ  సినిమాతోనే హీరోగా పరిచయమవుతున్న బెల్లంకొండ గణేశ్, తొలి ప్రయత్నంలోనే హిట్ కొడతాడేమో చూడాలి. 

More Telugu News