Telangana: తెలంగాణలో కొత్తగా 493 మందికి కరోనా

Telangana corona bulletin
తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 29,084 కరోనా పరీక్షలు నిర్వహించగా, 493 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 366 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 40, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 34 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 219 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

ఇక తెలంగాణలో ఇప్పటిదాకా 7,98,125 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,90,692 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 3 వేలు దాటింది. రాష్ట్రంలో ఇంకా 3,322 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మృతి చెందారు.
Telangana
Corona Virus
Bulletin
Update

More Telugu News