మహేశ్ 30వ సినిమా డైరెక్టర్ గా సుకుమార్?

24-06-2022 Fri 18:22
  • హ్యాట్రిక్  హిట్ తో ఉన్న సుకుమార్ 
  • 'పుష్ప 2' కోసం జరుగుతున్న కసరత్తు
  •  లైన్లోనే ఉన్న విజయ్ దేవరకొండ 
  • ఆ తరువాత  ప్రాజెక్టు మహేశ్ బాబుతోనే అంటూ టాక్     
Mahesh Babu in Sukumar movie
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఇప్పుడు సుకుమార్ ఒకరు. వరుసగా మూడు భారీ సినిమాలతో సంచలన విజయాలను నమోదు చేసిన ఆయన, హ్యాట్రిక్ హిట్ తో కొనసాగుతున్నారు. ఆ జాబితాలో 'నాన్నకు ప్రేమతో' .. 'రంగస్థలం' .. 'పుష్ప' కనిపిస్తాయి. కంటెంట్ పరంగా ఒకదానితో ఒకటి ఎంతమాత్రం సంబంధం లేని సినిమాలు ఇవి.  

ప్రస్తుతం ఆయన 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తరువాత విజయ్ దేవరకొండతో గానీ .. మరో హీరోతో గాని చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా తరువాత మాత్రం మహేశ్ బాబుతో సెట్స్ పైకి వెళ్లనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆల్రెడీ మహేశ్ బాబు కథను వినడం జరిగిపోయిందని చెబుతున్నారు.

ఈ లోగా త్రివిక్రమ్ తో సినిమాను .. రాజమౌళి ప్రాజెక్టును మహేశ్ బాబు పూర్తిచేస్తాడట. ఆ తరువాత ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళతారన్న మాట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన '1 నేనొక్కడినే' ఆశించినస్థాయి వసూళ్లను రాబట్టలేదు గానీ .. మంచి ప్రయత్నం అనిపించుకుంది.