గుజరాత్ అల్లర్ల కేసులో మోదీకి క్లిన్ చిట్ కు సుప్రీం సమర్థన.. పిటిషన్ తిరస్కరణ
- తాజా దర్యాప్తు కోరుతూ దివంగత కాంగ్రెస్ ఎంపీ భార్య పిటిషన్
- అర్హత లేదంటూ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- లోగడ సుప్రీంకోర్టు నియమిత సిట్ నుంచి క్లీన్ చిట్
సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నాటి అల్లర్లపై దర్యాప్తు నిర్వహించి మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం. నాడు అల్లర్ల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ జాఫ్రీ సహా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. గోద్రాలో సాధువులతో వెళుతున్న రైలు కోచ్ కు దుండగులు నిప్పు పెట్టడం.. 59 మంది సాధువులు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. దీంతో నాడు పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
నాటి మత ఘర్షణలపై తాజా దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని జకియా జాఫ్రీ సుప్రీంకోర్టును కోరారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందంటూ, రాజకీయ నాయకులు, పోలీసుల పాత్ర ఉందని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని, తాజా దర్యాప్తునకు ఎటువంటి ఆధారాల్లేవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సిట్ 2012 ఫిబ్రవరిలో దర్యాప్తు ముగింపు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించడమే కాకుండా.. మోదీతోపాటు మరో 63 మందికి సంబంధించి ఎటువంటి ఆధారాల్లేవని పేర్కొంది.