ఏయూ జేఏసీ ఫిర్యాదు.. అయ్యన్నపాత్రుడిపై మరో కేసు

  • చోడవరం మినీ మహానాడులో ఏయూ ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడారని ఫిర్యాదు
  • సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులు
  • ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనక్కి
Another Case Against TDP Leader Ayyanna Patrudu

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించిన మినీ మాహానాడులో ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను దిగజార్చేలా అయ్యన్న మాట్లాడారని ఆరోపిస్తూ ఏయూ జేఏసీ ఆయనపై విశాఖపట్టణం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసింది. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెక్షన్ 41ఏ కింద అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు గత రాత్రి నర్సీపట్నంలోని ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అయ్యన్న లేకపోవడంతో ఆయన పెద్దకుమారుడు విజయ్‌తో మాట్లాడారు. ఆ నోటీసులు తనకు ఇవ్వాలని విజయ్ కోరినా ఇవ్వకుండా ఆయనకే ఇస్తామని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని త్రీ టౌన్ సీఐ రామారావు నిర్ధారించారు.

More Telugu News