Dinkar Gupta: జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్‌గా దినకర్ గుప్త

IPS officer Dinkar Gupta appointed DG of NIA
  • రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నగుప్త
  • హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శిగా స్వాగత్ దాస్ నియామకం
  • ఉత్తర్వులు జారీ చేసిన కేబినెట్ నియామకాల కమిటీ

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి దినకర్ గుప్త నియమితులయ్యారు. పంజాబ్ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన గుప్త 31 మార్చి 2024 వరకు, లేదంటే ఆయన పదవీ విరమణ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. 

అలాగే, చత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 1987 ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) స్పెషల్ డైరెక్టర్ స్వాగత్ దాస్‌.. హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ (MHA) ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత)గా నియమితులయ్యారు. 30 నవంబరు 2024 లేదంటే ఆయన పదవీ విరమణ తేదీ వరకు లేదంటే, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయనీ పదవిలో కొనసాగుతారు.

  • Loading...

More Telugu News