Andhra Pradesh: ఒకేసారి 4 కంపెనీల‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్ర‌భుత్వం

4 more companies signed mous with andhra pradesh government
  • తిరుప‌తి టూర్‌లో బిజీబిజీగా జ‌గ‌న్‌
  • అపాచీ స‌హా 5 కంపెనీల‌కు భూమి పూజ చేసిన జ‌గ‌న్‌
  • జ‌గ‌న్ స‌మ‌క్షంలో 4 కంపెనీల‌తో ఏపీఈఐటీఏ ఒప్పందం
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం శ్రీ బాలాజీ తిరుప‌తి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో బిజీబిజీగా గ‌డిపారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఐదు ప‌రిశ్ర‌మ‌ల‌కు భూమి పూజ చేయ‌డంతో పాటు మ‌రో నాలుగు కంపెనీల‌తో కొత్త‌గా ఒప్పందాలు చేసుకున్నారు. ఈ మేర‌కు గురువారం తిరుప‌తి వెళ్లిన జ‌గ‌న్‌... అపాచీతో పాటు ప్యానెల్ ఆప్టో డిస్‌ప్లే టెక్నాల‌జీస్ లిమిటెడ్‌, డిక్సాన్ టెక్నాల‌జీస్‌, ఫాక్స్ లింక్, స‌న్నీ ఆప్టో టెక్ లకు భూమి పూజ చేశారు. 

అనంత‌రం అక్క‌డే పీఓటీపీఎల్‌ ఎలక్ట్రానిక్స్‌, టెక్ బుల్స్, స్మార్ట్ డీవీ టెక్నాలజీస్, జెట్ వర్క్ టెక్నాలజీస్ సంస్థలతో కీల‌క ఒప్పందాలు చేసుకున్నారు. జ‌గ‌న్ స‌మ‌క్షంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ ఏజెన్సీ (ఏపీఈఐటీఏ) అధికారులు ఆయా కంపెనీల‌తో ఒప్పందాల‌పై సంత‌కాలు చేశారు. ఈ ఒప్పందాల ద్వారా ఏపీకి ఏ మేర పెట్టుబ‌డులు రానున్నాయ‌న్న విష‌యం తెలియ‌రాలేదు.
Andhra Pradesh
YSRCP
YS Jagan
Sri Balaji District
Tirupati

More Telugu News