ఉపరాష్ట్రపతి వెంకయ్యతో ద్రౌపది ముర్ము భేటీ
- ఢిల్లీ చేరుకున్న ద్రౌపది ముర్ము
- వరుసబెట్టి ప్రముఖులను కలుస్తున్న ముర్ము
- ఉపరాష్ట్రపతి అధికారిక నివాసంలో వెంకయ్యతో భేటీ
ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థి రేసులో వెంకయ్య పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. దక్షిణాదికి చెందిన నేతను ఎంపిక చేయాలనుకున్న పక్షంలో వెంకయ్యే ఎన్టీఏ అభ్యర్థిగా ఖరారై ఉండేవారన్న వాదనలు వినిపించాయి. అంతేకాకుండా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం సమయంలో ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలంటూ వెంకయ్యకు సమాచారం రావడం, ఆ సమయంలో హైదరాబాద్‌లో ఉన్న వెంకయ్య తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని మరీ ఢిల్లీ వెళ్లడం చూసి వెంకయ్య అభ్యర్థిత్వం ఖరారైపోయినట్టేనన్న వాదనలు వినిపించాయి. అయితే మహిళ... అది కూడా గిరిజన సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలన్న నిర్ణయంతో సాగిన బీజేపీ ముర్ము అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.