KTR: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో కేటీఆర్ భేటీ     

KTR meets Hardeep Singh Puri
  • ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి 
  • ఎస్టీపీల నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని కోరిన కేటీఆర్
  • హైదరాబాద్ ర్యాపిడ్ ట్రాన్సిట్ కారిడార్ కు సహకరించాలని వినతి
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ పూరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వీరు చర్చించారు. ఎస్టీపీల నిర్మాణాలకు రూ. 8,654.54 కోట్ల ఖర్చు అవుతోందని కేంద్ర మంత్రికి కేటీఆర్ తెలిపారు. ప్రాజెక్టు వ్యయంలో మూడో వంతును అమృత్-2 కింద రూ. 2,850 కోట్లు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ లో ర్యాపిడ్ ట్రాన్సిట్ కారిడార్ కు సహకరించాలని విన్నవించారు. మరోవైపు కేటీఆర్ వెనుక జయేశ్ రంజన్ వంటి ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.
KTR
TRS
Hardeep Singh Puri

More Telugu News