Bandla Ganesh: పూరి జగన్నాథ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేశ్

  • నిన్న జరిగిన ఆకాశ్ పూరీ 'చోర్ బజార్' ప్రీరిలీజ్ ఈవెంట్
  • ఈ కార్యక్రమానికి హాజరుకాని పూరీ జగన్నాథ్
  • కొడుకు సినిమా ఫంక్షన్ కు కూడా వచ్చే సమయం లేదా? అని బండ్ల గణేశ్ ప్రశ్న
Bandla Ganesh Shocking comments on Puri Jagannath

సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ ను ఉద్దేశించి నిర్మాత బండ్ల గణేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ నటించిన 'చోర్ బజార్' సినిమా రేపు విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. అయితే ఈ ఈవెంట్ కు పూరీ జగన్నాథ్ హాజరు కాలేదు. 

ఈ నేపథ్యంలో ఈవెంట్ లో బండ్ల గణేశ్ మాట్లాడుతూ, పూరీ జగన్నాథ్ ఎంతో మంది స్టార్లను తయారు చేశారని చెప్పారు. ఇప్పుడు తన కొడుకు సినిమా ఫంక్షన్ జరుగుతుంటే ఆయన రాకపోవడం తనకు నచ్చలేదని అన్నారు. కొడుకు ఈవెంట్ కు హాజరు కావడానికి కూడా సమయం లేదా? అని ప్రశ్నించారు. తన కొడుకు సినిమా ఫంక్షన్ అయినట్టయితే... తాను ఎక్కడున్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చేవాడినని అన్నారు. ముంబైలో తన సినిమా షూటింగ్ బిజీ వల్ల ఈ ఈవెంట్ కు పూరీ జగన్నాథ్ రాలేకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News