మహింద్రా సంస్థ తయారుచేసిన 3,00,001వ ట్రాక్టర్ ను ఆవిష్కరించిన కేటీఆర్

  • మహీంద్రా మరో మైలురాయి
  • జహీరాబాద్ ప్లాంట్ లో 3,00,001వ ట్రాక్టర్ తయారీ
  • నడిపి చూసిన కేటీఆర్
KTR launches Mahindra milestone tractor

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా తన 3,00,001వ ట్రాక్టర్ ను తెలంగాణలోని ప్లాంట్ లో తయారుచేసింది. ఈ సందర్భంగా జహీరాబాద్ లోని మహీంద్రా ప్లాంట్ లో ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మహీంద్రా 3,00,001వ ట్రాక్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం దాన్ని నడిపారు. 

ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. "హేయ్... ఆనంద్ మహీంద్రా జీ... నన్ను చూడండి... మీ ఉత్పత్తులకు ఎంత చక్కగా ప్రచారం కల్పిస్తున్నానో! అందుకని మీరు మా రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు స్థాపించాల్సి ఉంటుంది" అంటూ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాను ఉద్దేశించి చమత్కరించారు.

More Telugu News