ప్ర‌భుత్వం కూల్చిన గోడ క‌ట్టుకునేందుకు అయ్య‌న్న‌కు హైకోర్టు అనుమ‌తి

  • ప్ర‌భుత్వ భూమిలో అయ్యన్న ఇల్లు నిర్మించుకున్నార‌న్న అధికారులు   
  • ఇంటి ప్ర‌హ‌రీని కూల్చేసిన వైనం
  • ఈ వ్య‌వ‌హారంపై హైకోర్టును ఆశ్ర‌యించిన అయ్య‌న్న‌
  • నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా గోడ కూల్చార‌ని ఆరోప‌ణ‌
  • గోడ క‌ట్టుకునేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని అభ్యర్థన‌
ap high court allows ayyannapatrudu to construct wall in his house

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్యన్న‌ పాత్రుడికి ఏపీ హైకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. న‌ర్సీప‌ట్నంలో ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మించి అయ్య‌న్న త‌న ఇంటిని క‌ట్టుకున్నార‌ని ఆరోపిస్తూ 3 రోజుల క్రితం ఏపీ ప్ర‌భుత్వ అధికారులు ఆయ‌న ఇంటి ప్ర‌హ‌రీని కూల్చివేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా అధికారుల‌ను అడ్డుకునేందుకు అయ్య‌న్న కుమారుడు విజ‌య్ తీవ్రంగా య‌త్నించారు. అంతేకాకుండా ప్ర‌భుత్వం, అధికారుల తీరును నిర‌సిస్తూ విజ‌య్ త‌న ఇంటిలోనే దీక్ష‌కు కూడా దిగారు. 

ఈ వ్య‌వ‌హారంపై అయ్య‌న్న‌పాత్రుడు ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అధికారులు త‌న ఇంటి గోడ‌ను కూల్చివేశారంటూ ఆయ‌న త‌న పిటిష‌న్‌లో హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. కూల్చేసిన గోడ‌ను తిరిగి నిర్మించుకునేందుకు అనుమ‌తించాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు. అయ్య‌న్న త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌లు విన్న హైకోర్టు... ప్ర‌భుత్వం కూల్చేసిన గోడ‌ను నిర్మించుకునేందుకు అయ్య‌న్న‌కు అనుమ‌తి ఇచ్చింది. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ‌ను వాయిదా వేసింది.

More Telugu News