Prabhas: ప్రభాస్ రేటు పెంచాడంటున్న బాలీవుడ్ మీడియా!

Bollywood media says Parabhas hiked his remuneration
  • ఆదిపురుష్ లో నటిస్తున్న ప్రభాస్
  • ఓం రౌత్ దర్శకత్వంలో చిత్రం
  • ప్రభాస్ జంటగా కృతి సనన్
  • ఇంకా మిగిలున్న షూటింగ్ పార్టు
ఒక్కొక్క సినిమాతో తన పరిధిని మరింత పెంచుకుంటూ పోతున్న టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ బాలీవుడ్ లో ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నాడు. బాహుబలి నుంచి ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనూ తెరకెక్కుతున్నాయి. ఆదిపురుష్ కూడా హిందీతో పాటు పలు భాషల్లో రూపొందిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గాను ప్రభాస్ రేటు పెంచాడని బాలీవుడ్ మీడియా పేర్కొంటోంది. 

ఈ సినిమా కోసం రూ.120 కోట్ల పారితోషికం అడుగుతున్నాడని బాలీవుడ్ లైఫ్ మీడియా కథనం చెబుతోంది. ఇంతకుముందు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య తన పారితోషికం నిర్ణయించాడని, ఇప్పుడు ఆదిపురుష్ నిర్మాతల నుంచి రూ.120 కోట్లు కోరుతున్నాడని ఆ కథనంలో పేర్కొన్నారు. దాంతో ఆదిపురుష్ బడ్జెట్ ఒక్కసారిగా 25 శాతం పెరగనుందని, ఈ పరిస్థితి నిర్మాతలకు ఇబ్బందికరమేనని ఆ కథనం వివరించింది. అయితే ఇందులో నిజమెంత అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది.

ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతిసనన్ జంటగా ఆదిపురుష్ తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు.
Prabhas
Remuneration
Adipurush
Bollywood
Tollywood

More Telugu News