1998 DSC: సీఎం జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన 1998 డీఎస్సీ అభ్యర్థులు

1998 DSC candidates met CM Jagan and thanked
  • వివాదంలో 1998 డీఎస్సీ
  • న్యాయస్థానానికి చేరిన వ్యవహారం
  • 24 ఏళ్ల అనంతరం ఉద్యోగాలు
  • ఫైలుపై సంతకం చేసిన సీఎం జగన్

దాదాపు అందరూ మర్చిపోయిన 1998 డీఎస్సీ అభ్యర్థుల వ్యవహారం సీఎం జగన్ సంతకంతో మళ్లీ తెరపైకి వచ్చింది. నాటి డీఎస్సీ అభ్యర్థుల ఫైలుపై సీఎం జగన్ సంతకంతో అనేకమంది టీచర్ ఉద్యోగాలు పొందారు. తాజాగా టీచర్ ఉద్యోగం పొందిన వారిలో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, 55 ఏళ్ల వయసున్న ఓ కూలీ కూడా ఉండడం విశేషం. 

ఈ నేపథ్యంలో, 1998 డీఎస్సీ అభ్యర్థులు నేడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. సీఎం జగన్ ను కలిసి భావోద్వేగాల నడుమ కృతజ్ఞతలు తెలియజేశారు. 24 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించారంటూ సంతోషం వ్యక్తం చేశారు. తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ను 1998 డీఎస్సీ అభ్యర్థులు సన్మానించారు.

  • Loading...

More Telugu News