C Kalyan: సినీ కార్మికుల సమ్మెపై నిర్మాత సి.కల్యాణ్ స్పందన

C Kalyan response on cine workers strike
షార్ట్స్‌లో చూడండి
వేతనాలు పెంచాలని టాలీవుడ్ కు చెందిన 24 క్రాఫ్ట్స్ కు చెందిన సినీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ కార్మికుల వేతనాలు పెంచడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. అయితే ఉన్నపళంగా సమ్మెకు దిగడం మంచిది కాదని అన్నారు. తాము షూటింగులు ఆపడానికి సిద్ధంగా లేమని చెప్పారు. నిర్మాతలమంతా చర్చలు జరిపాక వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

మరోవైపు సినీ కార్మికులు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఎక్కడా తెలుగు చిత్రాల షూటింగులు జరగవని చెప్పారు. ఫిల్మ్ ఛాంబర్ కల్పించుకుని తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు.
Go Back to Shorts
C Kalyan
Tollywood
Workers

More Telugu News