Nellore District: ముగిసిన ప్ర‌చారం... ఎల్లుండి ఆత్మ‌కూరు ఉప ఎన్నిక పోలింగ్‌

campaign concludes in atmakur bypoll
షార్ట్స్‌లో చూడండి
ఏపీ దివంగ‌త మంత్రి మేకపాటి గౌత‌మ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీకి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌కు సంబంధించిన ప్ర‌చారం మంగ‌ళ‌వారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 23 (గురువారం)న ఉప ఎన్నిక‌ పోలింగ్ జ‌ర‌గ‌నుంది. పోలింగ్‌కు సంబంధించి ఇప్ప‌టికే ఏర్పాట్ల‌న్నీ పూర్తి కాగా... నియోజ‌క‌వ‌ర్గంలోని 278 పోలింగ్ కేంద్రాల‌కు రేపు సాయంత్రానికి పోలింగ్ సిబ్బంది చేరుకోనున్నారు.

ఇదిలా ఉంటే... గౌత‌మ్ రెడ్డి మ‌ర‌ణంతో జ‌రుగుతున్న ఈ ఉప ఎన్నిక‌లో వైసీపీ త‌న అభ్య‌ర్థిగా గౌత‌మ్ రెడ్డి సోద‌రుడు మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డినే బ‌రిలోకి దించింది. దీంతో సంప్ర‌దాయాన్ని గౌర‌విస్తూ ఉప ఎన్నిక పోటీకి టీడీపీ దూరంగా ఉండిపోయింది. ఈ క్ర‌మంలో వైసీపీ అభ్యర్థితో పాటు బీజేపీ స‌హా మొత్తం 14 మంది ఈ ఎన్నికల బ‌రిలో నిలిచారు.
Go Back to Shorts
Nellore District
Atmakur Bypoll
YSRCP
TDP
BJP
Mekapati Goutham Reddy

More Telugu News