ఏపీలో శ్రీ సిమెంట్ భారీ పెట్టుబడి... రూ.2,500 కోట్లతో దాచేపల్లి ప్లాంట్ విస్తరణ
- దాచేపల్లిలో సిమెంట్ ప్లాంట్‌ను కలిగి ఉన్న శ్రీ సిమెంట్
- దాని విస్తరణకు రూ.2,500 కోట్లు వెచ్చించనున్న కంపెనీ
- అధికారికంగా ప్రకటించిన శ్రీ సిమెంట్ లిమిటెడ్
ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఏపీలో తన తాజా పెట్టుబడులకు సంబంధించి శ్రీ సిమెంట్ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం దాచేపల్లి ప్లాంట్ విస్తరణ కోసం శ్రీ సిమెంట్ ఏకంగా రూ.2,500 కోట్ల మేర పెట్టుబడి పెట్టనుంది.