YS Sharmila: 100 రోజుల మార్క్ దాటిన ష‌ర్మిల యాత్ర‌... భారీ జ‌నసందోహాన్ని చూసి ఉప్పొంగిపోయిన వైఎస్సార్టీపీ అధినేత్రి

ys sharmila padayatra touches 100 days mark at kodad
  • తెలంగాణ‌లో పాద‌యాత్ర చేస్తున్న ష‌ర్మిల‌
  • మంగ‌ళ‌వారం 100 రోజుల మార్క్‌ను దాటిన పాద‌యాత్ర‌
  • కోదాడ‌లో భారీగా హాజ‌రైన జ‌నం
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల తెలంగాణ‌లో చేప‌ట్టిన పాద‌యాత్ర మంగ‌ళ‌వారం 100 రోజుల మార్క్‌ను చేరుకుంది. మంగ‌ళ‌వారం వైఎస్ ష‌ర్మిల పాద‌యాత్ర‌ సూర్యాపేట జిల్లా కోదాడ‌కు చేరుకుంది. ష‌ర్మిల పాద‌యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో పార్టీ శ్రేణులు కోదాడ‌లో భారీ ఏర్పాట్లు చేశాయి. ష‌ర్మిల‌ను చూసేందుకు జ‌నం కూడా భారీ సంఖ్య‌లోనే అక్క‌డికి చేరుకున్నారు.

ఈ సంద‌ర్భంగా త‌న యాత్ర‌కు భారీ జ‌న‌సందోహం హాజ‌రైన వైనాన్ని చూసి ష‌ర్మిల ఉప్పొంగిపోయారు. త‌న‌ను చూసేందుకు వ‌చ్చిన జ‌నానికి అభివాదం చేస్తూ సాగిన ఆమె... జ‌నంతో మ‌మేక‌మ‌య్యారు. జ‌నం మ‌ధ్య‌లోనే న‌డుస్తూ కొంత దూరం సాగారు. ఈ మేర‌కు పాద‌యాత్ర‌కు హాజ‌రైన భారీ జ‌న‌సందోహాన్ని చూపుతూ ఫొటోల‌ను ష‌ర్మిల త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
YS Sharmila
YSRTP
Telangana
Padayatra
Kodad

More Telugu News