Sunset: అందమైన 'సంధ్య'ను బంధించే క్రమంలో న్యూయార్క్ రోడ్లపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్

Huge traffic jam in New York roads due to beautiful sunset
  • న్యూయార్క్ లో అద్భుత సూర్యాస్తమయం
  • ఆకాశంలో కనువిందు 
  • రోడ్లపైకి వచ్చిన జనాలు
  • ఫొటోలు తీసుకుంటూ ట్రాఫిక్ ను కూడా పట్టించుకోని వైనం
ఆకాశంలో అందమైన కాంతులు విరజిమ్మే సూర్యాస్తమయాన్ని ఇష్టపడని వారెవ్వరుంటారు! చేతిలో కెమెరా, ఫోన్ ఉంటే చాలు... పడమటివైపుకి జారిపోతున్న ఆ 'సంధ్య'వేళ అందాలను బంధించేందుకు ప్రయత్నిస్తుంటారు. న్యూయార్క్ నగరంలోనూ అదే జరిగింది. 

మన్ హట్టన్ ప్రాంతంలో సాయంత్రం వేళ సూర్యుడు అస్తమిస్తున్న క్షణాలు అద్భుతంగా గోచరించాయి. ఆకాశంలో పరుచుకున్న కనువిందు చేసే కాంతులను చూసి వాహనాల్లో వెళ్లేవారు సైతం తమ కెమెరాలకు పనిచెప్పారు. దాంతో రోడ్లపై వాహనాలు నిలిచిపోయి, జనాలతో రోడ్లు రద్దీగా మారాయి. ప్రతి ఒక్కరూ తమ ఫోన్ పట్టుకుని సాయంసంధ్యను చిత్రీకరించడం మొదలుపెట్టారు. 

ఈ నేపథ్యంలో, అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జనాలు మాత్రం ఇవేవీ పట్టకుండా, సూర్యాస్తమయ సోయగాన్ని ఆస్వాదించడంపైనే దృష్టి సారించారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
Sunset
Traffic Jam
Roads
New York

More Telugu News