Prime Minister: రేపు త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ

Prime Minister Narendra Modi meets chiefs of indian armed forces tomorrow in delhi
  • అగ్నిప‌థ్ ప‌థ‌కంపైనే కీల‌క చ‌ర్చ‌
  • ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క ప‌ర్య‌ట‌న‌లో మోదీ
  • రేపు మైసూరులో నిర్వ‌హించ‌నున్న యోగా డేలో పాల్గొన‌నున్న ప్ర‌ధాని
  • ఆ త‌ర్వాత ఢిల్లీలో త్రివిధ ద‌ళాధిప‌తుల‌తో భేటీ
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మంగ‌ళ‌వారం ఓ కీల‌క భేటీని నిర్వ‌హించ‌నున్నారు. భార‌త సైన్యానికి చెందిన త్రివిద ద‌ళాల‌కు చెందిన అధిపతుల‌తో ఆయ‌న భేటీ కానున్నారు. భార‌త సైన్యంలోకి భారీ ఎత్తున నియామ‌కాల‌కు ఉద్దేశించిన అగ్నిప‌థ్ ప‌థ‌కం ప్ర‌క‌ట‌న‌, దానిపై దేశ‌వ్యాప్తంగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు, వాటికి విప‌క్షాల మ‌ద్ద‌తు త‌దిత‌ర అంశాల‌పై ఈ భేటీలో త్రివిధ ద‌ళాల అధిప‌తుల‌తో మోదీ చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. 

సోమ‌వారం క‌ర్ణాట‌క ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన మోదీ... మంగ‌ళ‌వారం ప్ర‌పంచ యోగా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని మైసూరులో నిర్వ‌హించే యోగా డేలో పాలుపంచుకుంటారు. ఆ త‌ర్వాత ఢిల్లీకి వెళ్ల‌నున్న ఆయ‌న త్రివిధ ద‌ళాధిప‌తుల‌తో భేటీ కానున్నారు. అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని ర‌ద్దు చేయాలంటూ ప‌లు రాజ‌కీయ పార్టీల‌తో పాటుగా ప్ర‌జా సంఘాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్న నేప‌థ్యంలో త్రివిధ ద‌ళాధిప‌తులతో ప్ర‌ధాని మోదీ భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంది.
Prime Minister
Narendra Modi
Agnipath Scheme
Indian Army

More Telugu News