Mallikarjuna Reddy: ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, వైస్ చైర్మన్ లకు క్యాబినెట్ హోదా ఖరారు

Cabinet status for APSRTC Chairman and Vice Chairman
  • గతేడాది నామినేటెడ్ పోస్టుల భర్తీ
  • ఏపీఎస్ఆర్టీసీకి చైర్మన్, వైస్ చైర్మన్ నియామకం
  • అవకాశం దక్కించుకున్న మల్లికార్జునరెడ్డి, విజయానందరెడ్డి
  • ఎస్ కేటగిరీ కింద క్యాబినెట్ హోదా ఖరారు
గతేడాది ఏపీ ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. సీఎం సమీప బంధువు ఏ.మల్లికార్జునరెడ్డి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా నియమితులు కాగా, సంస్థ వైస్ చైర్మన్-డైరెక్టర్ గా చిన్నప్పరెడ్డి విజయానందరెడ్డికి అవకాశం ఇచ్చారు. కాగా, వీరిద్దరికీ క్యాబినెట్ హోదాను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన జీవోను సాధారణ పరిపాలన శాఖ గత నెల 17నే విడుదల చేసింది. తాజాగా, ఎస్ కేటగిరీ కింద క్యాబినెట్ హోదాను ఖరారు చేస్తూ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Mallikarjuna Reddy
Vijayananda Reddy
APSRTC
Cabinet
YSRCP
Andhra Pradesh

More Telugu News