ముగిసిన రాహుల్ గాంధీ ఈడీ విచారణ... రేపు మళ్లీ రావాలంటూ సమన్లు
- నాలుగో రోజు 10 గంటల పాటు రాహుల్ విచారణ
- 4 రోజుల్లో దాదాపుగా 40 గంటల పాటు రాహుల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం
- మంగళవారం కూడా విచారణకు రావాలంటూ రాహుల్‌కు ఈడీ సమన్లు
గత వారం 3 రోజుల పాటు తమ ముందు విచారణకు హాజరైన రాహుల్ గాంధీని ఈడీ అధికారులు దాదాపుగా 30 గంటల పాటు ప్రశ్నించారు. తాజాగా సోమవారం నాటి విచారణలో కూడా రాహుల్ గాంధీని ఈడీ అధికారులు దాదాపుగా 10 గంటల పాటు విచారించారు. వెరసి 4 రోజుల విచారణలో భాగంగా ఈడీ అధికారులు రాహుల్‌ను 40 గంటల పాటు విచారించినట్టయింది. నాలుగో రోజు విచారణ ముగింపు సందర్భంగా మంగళవారం కూడా విచారణకు రావాల్సిందేనని రాహుల్‌కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు.