Nayanthara: హనీమూన్ కు థాయ్ లాండ్ వెళ్లిన నయనతార, విఘ్నేశ్ శివన్

Nayanatara and Vighnesh Sivan enjoys honeymoon in Thailand
షార్ట్స్‌లో చూడండి
దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ జూన్ 9న పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే. చాలాకాలంగా ప్రేమలో ఉన్న వీరు ఎట్టకేలకు ఓ ఇంటివారయ్యారు. కాగా, నయనతార, విఘ్నేశ్ శివన్ హనీమూన్ కు ఎక్కడికి వెళతారన్నది ఓ ఇంట్రస్టింగ్ టాపిక్ గా మారింది. 

అయితే ఈ జోడీ థాయ్ లాండ్ ను తమ హనీమూన్ వేదికగా ఎంచుకుంది. నయనతారతో తన భావోద్వేగాలను పంచుకుంటున్న ఫొటోలను విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వీరిద్దరూ ఇక్కడి సముద్ర తీరప్రాంతంలోని ఓ లగ్జరీ రిసార్ట్ విల్లాలో బస చేసినట్టు తెలుస్తోంది. నా స్వీట్ హార్ట్ తో థాయ్ లాండ్ లో అంటూ విఘ్నేశ్ శివన్ తన పోస్టులో పేర్కొన్నాడు.
.
Go Back to Shorts
Nayanthara
Vighnesh Sivan
Honeymoon
Thailand

More Telugu News