తెలంగాణలో ఉద్యోగుల పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్
- ఉపాధ్యాయ, ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- 2,558 మంది ఉద్యోగులకు ప్రయోజనం
- ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేయాలని మంత్రి సబిత ఆదేశం
పరస్పర బదిలీలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్రంలోని 2,558 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రయోజనం లభించనుంది. విద్యా శాఖ మంత్రి ఆదేశాలతో ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ఒకటి, రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఇక ఉద్యోగుల పరస్పర బదిలీలకు కూడా త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.