రేపు 'ఛలో నర్సీపట్నం'కు టీడీపీ పిలుపు

  • నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేత
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు
  • గతంలోనూ బీసీ నేతల ఆస్తులపై దాడులు చేశారన్న అచ్చెన్న
  • ప్రశ్నిస్తే దాడులు చేయడం జగన్ కు అలవాటైందని వెల్లడి
TDP calls for Chalo Narsipatnam

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీ గోడ కూల్చివేతను నిరసిస్తూ టీడీపీ రేపు 'ఛలో నర్సీపట్నం' కార్యాచరణకు పిలుపునిచ్చింది. దీనిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ, గతంలో ఇలాగే పల్లా శ్రీనివాస్, సబ్బం హరి తదితర బీసీ నేతల ఆస్తులపై దాడులు చేశారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయించడం జగన్ కు అలవాటైందని విమర్శించారు. బీసీల పట్ల జగన్ చూపిస్తున్న కపట ప్రేమను నిలదీస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

More Telugu News