Swathi Sathish: వికటించిన దంతవైద్యం... ముఖం ఉబ్బిపోయి భయంకరంగా తయారైన హీరోయిన్

Kannada heroine face changed after root canal treatment
  • రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ చేయించుకున్న స్వాతి సతీష్
  • వాచిపోయిన ముఖం
  • గుర్తుపట్టలేని విధంగా తయారైన వైనం
  • మరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటి
కన్నడ నటి స్వాతి సతీష్ కు దంత వైద్యం వికటించగా, ఆమె ముఖం ఉబ్బిపోయి గుర్తుపట్టలేని విధంగా తయారైంది. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన స్వాతి సతీష్ ఇటీవల రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ చేయించుకునేందుకు ఓ డెంటల్ క్లినిక్ కు వెళ్లింది. అయితే, రూట్ కెనాల్ చికిత్స అనంతరం ఆమె ముఖం భయంకరంగా తయారైంది. ముఖం అంతా వాచిపోవడంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరోవైపు తీవ్రమైన నొప్పి కూడా కలగడంతో ఆ యువ హీరోయిన్ బాధ వర్ణనాతీతం. అందవికారంగా తయారవడంతో కొన్ని సినిమా చాన్సులు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. 

బెంగళూరులోని ఆ డెంటల్ క్లినిక్ లో తనకు తప్పుడు వైద్యం చేశారని స్వాతి ఆరోపిస్తోంది. ట్రీట్ మెంట్ సమయంలో అనస్తీషియా ఇచ్చేటప్పుడు వేరే మందు (సాల్సిలిక్ యాసిడ్) ఇచ్చి ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్వాతి మరో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కోలుకున్నాక సదరు డెంటల్ క్లినిక్ పై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. స్వాతి సతీష్ కన్నడలో 6 టు 6, ఎఫ్ఐఆర్ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.
Swathi Sathish
Dental Hospital
Root Canal Treatment
Swollen Face
Kannada

More Telugu News