ల్యాండ్ పర్మిషన్ ఇచ్చాకే గోడ కట్టామన్న అయ్యన్న కుమారుడు.. మునిసిపల్ సిబ్బంది తీరుపై ఆగ్రహం

  • ఈ తెల్లవారుజామున జేసీబీతో ఇంటి ప్రహరీని కూల్చేసిన అధికారులు
  • మునిసిపల్ అధికారులు అనుమతి ఇస్తేనే కట్టామన్న రాజేష్
  • రాజేష్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసుల యత్నం
  • స్వల్ప తోపులాట
Police Tried to arrest Chintakayala Ayyanna Patrudu son Rajesh

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీని ఈ తెల్లవారుజామున మునిసిపల్ అధికారులు జేసీబీతో కూల్చివేశారు. అంతకుముందు ఆయన ఇంటికి వచ్చే అన్ని దారులను మూసేసిన పోలీసులు.. ఇంటి వద్ద భారీగా మోహరించారు. ఇంటి ప్రహరీ కూల్చివేతపై అయ్యన్న కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. మునిసిపల్ అధికారుల నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రహరీ నిర్మించినట్టు అయ్యన్న రెండో కుమారుడు చింతకాయల రాజేష్ తెలిపారు. 

ల్యాండ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతే గోడను నిర్మించామన్నారు. పోలీసులు ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేశారని ఆరోపించారు. అయితే, అధికారులు మాత్రం గోడను ప్రభుత్వ స్థలంలో నిర్మించినందుకే కూల్చేసినట్టు చెబుతున్నారు. మరోవైపు, అయ్యన్నఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయన కుమారుడు రాజేష్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు, అయ్యన్న కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వివాదం జరిగి స్వల్ప తోపులాట కూడా చోటుచేసుకుంది.

More Telugu News