Bijay Shankar Das: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారు: ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు

BJD MLA Bijay Shankar Das fails to turn up for own wedding
  • బీజేడీ ఎమ్మెల్యే విజయ్‌శంకర్ దాస్‌పై ఫిర్యాదు
  • పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకరించారన్న బాధితురాలు
  • సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వేచి చూసి వెళ్లిపోయానన్న యువతి
  • మోసపోయినట్టు గుర్తించి ఫిర్యాదు చేశానని వెల్లడి
తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన ఎమ్మెల్యే ఆ తర్వాత మోసం చేశారంటూ ఒడిశాకు చెందిన యువతి బీజేడీ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా తిర్తోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయ్‌శంకర్ దాస్, తాను ప్రేమించుకున్నామని సోమాలిక దాస్ అనే యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ వివాహానికి ఇరు కుటుంబాల వారు అంగీకరించారన్నారు. 

పెళ్లి కోసం జగత్సింగ్‌పూర్‌లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో మే 17న దరఖాస్తు కూడా చేసుకున్నామన్నారు. శుక్రవారం స్లాట్ ఇవ్వడంతో ఎమ్మెల్యే రాలేదని, చాలాసేపు ఆయన కోసం చూసి వెళ్లిపోయినట్టు చెప్పారు. ఫోన్ చేసినా స్పందించలేదని, దీంతో తాను మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సోనాలిక తెలిపారు.
Bijay Shankar Das
BJD
Odisha
Somalika Dash

More Telugu News