Revanth Reddy: వెనుక ద్వారం నుంచి గాంధీ ఆసుపత్రిలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy visits Gandhi Hospital
  • సికింద్రాబాద్ రైల్వే హింస సందర్భంగా కాల్పులు
  • గాయపడిన వారికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స
  • పరామర్శించిన రేవంత్ రెడ్డి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారగా, పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు మరణించడం, మరికొందరు గాయపడడం తెలిసిందే. గాయపడిన వారికి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

కాగా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం గాంధీ ఆసుపత్రి వద్దకు వచ్చారు. ఆసుపత్రి వెనుక గేటు నుంచి లోపలికి ప్రవేశించారు. ఈ సందర్భంగా పోలీసులకు, రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ అల్లర్లలో గాయపడిన వారిని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
Revanth Reddy
Gandhi Hospital
Secunderabad
Riots
Agnipath Scheme

More Telugu News