వినాయక్ ను రంగంలోకి దింపుతున్న మెగాస్టార్!
Add ap7am to your home Screen

వినాయక్ ను రంగంలోకి దింపుతున్న మెగాస్టార్!

Chiranjeevi Movies Update
  • చిరూ తాజా చిత్రంగా రానున్న ' గాడ్ ఫాదర్' 
  • లైన్లో బాబీ .. మెహర్ రమేశ్ సినిమాలు 
  • వెయిటింగులో వెంకీ కుడుముల  
  • వినాయక్ తో చిరూ మూడో సినిమాకి సన్నాహాలు 
చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన తాజా చిత్రంగా రూపొందుతున్న 'గాడ్ ఫాదర్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత ప్రాజెక్టులుగా బాబీ దర్శకత్వంలో 'వాల్తేర్ వీరయ్య' .. మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళా శంకర్' సినిమా లైన్లోనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు షూటింగు దశలోనే ఉన్నాయి. 

ఈ ప్రాజెక్టుల తరువాత వెంకీ కుడుములతో చిరంజీవి ఒక సినిమా చేయనున్నారు. ఆల్రెడీ అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలైపోయాయి. ఈ సినిమా తరువాత వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి చేయనున్నట్టు ఒక వార్త బలంగానే వినిపిస్తోంది. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఆరంభమైందనే చెబుతున్నారు. 

చిరంజీవికి వినాయక్ 'ఠాగూర్' .. 'ఖైదీ నెంబర్ 150' వంటి హిట్స్ ను ఇచ్చాడు. ఆయనపై చిరంజీవికి విపరీతమైన నమ్మకం ఉంది. తన స్టైల్ .. తన నుంచి అభిమానులు కోరుకునే అంశాలు వినాయక్ కి బాగా తెలుసును గనుక, ఆయనకి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందట.
Chiranjeevi
VV Vinayak
Tollywood

More Telugu News