Secunderabad: రైల్వేస్టేషన్ ఆందోళనకారులపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు.. నేరం రుజువైతే మరణశిక్ష కూడా పడొచ్చు!

  • సికింద్రాబాద్ స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడిన యువకులు
  • ఐఆర్ఏ, ఐపీసీ, జీఆర్పీ సెక్షన్ల కింద కేసుల నమోదు
  • ఐఆర్ఏ 150 సెక్షన్ కింద నేరం రుజువైతే యావజ్జీవ శిక్ష లేదా మరణశిక్ష
Case filed against Secunderabad railway station protesters

అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిన్న పెద్ద సంఖ్యలో యువకులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయి. ఆందోళనకారులు రైళ్లకు నిప్పు పెట్టారు. రైల్వేస్టేషన్ విధ్వంసానికి పాల్పడ్డారు. 

ఈ నేపథ్యంలో విధ్వంసానికి పాల్పడిన వారిపై జీఆర్పీ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో చిక్కుకున్న వారు సైన్యంలో పని చేసేందుకు అనర్హులవుతారు. అంతేకాదు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. 


రైల్వే ఆస్తులను ధ్వంసం చేసినందుకు వీరిపై భారతీయ రైల్వే చట్టం (ఐఆర్ఏ)లోని 14 సెక్షన్లు, ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. రైల్వే సెక్షన్లు అత్యంత కఠినంగా ఉంటాయి. వీటిలో చాలా వరకు నాన్ బెయిలబుల్ సెక్షన్లే. ఐఆర్ఏ 150 (రైలును ధ్వంసం చేయడం) సెక్షన్ కింద నేరం రుజువైతే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. ఈ కేసులో దోషిగా తేలితే యావజ్జీవ శిక్ష లేదా మరణశిక్షకు గురయ్యే అవకాశం ఉంది.

More Telugu News